కారుబోల్తా.. నలుగురి మృతి

నారాయణపేట: కారు బోల్తా పడటంతో నలుగురు మృతిచెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఆ జిల్లాల్లోని మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మూడేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.