కాస్త తగ్గిన బంగారం ధర

హైదరాబాద్: నిన్న పెరిగిన బంగారం ధర తాజాగా కాస్త తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 46,080 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 42,240 కు చేరింది. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర రూ. 71,800 కు చేరుకుంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.