`కెసిఆరే నా నిండు ప్రాణం..`

ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగులకు ధైర్యం చెప్పిన సిఎం కెసిఆర్..

వరంగల్ (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఇవాళ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఎంజిఎం ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. కెసిఆర్ నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎంజిఎం ప‌ర్య‌ట‌న అనంత‌రం వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ఆయ‌న పరిశీలించ‌నున్నారు. జైలు ప్రాంగ‌ణాంలోని 73 ఎరాల్లో కొత్త ఆసుప‌త్రి నిర్మాణంపై అధికారుల‌తో సిఎం చ‌ర్చించ‌నున్నారు. అలాగే క‌రోనా క‌ట్ట‌డి కోసం చేప‌డుతున్న చ‌ర్య‌ల‌పై సిఎం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సిఎస్ సోమేశ్ కుమార్, రిజ్వి, డీఎం ఈ రమేష్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంజీఎం సూప‌రింటెండెంట్ చంద్ర శేఖర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.