కేసీఆర్ అభిమాని మనవరాలి వివాహానికి ఎమ్మెల్సీ కవిత

మెట్‌పల్లి: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కెసిఆర్)ని అభిమానిస్తూ తన ఇంటి పేరునే కెసిఆర్‌గా మార్చుకున్న టిఆర్ ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యురాలి పెళ్లికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ‘కేసీఆర్ గంగారెడ్డి’ మనవరాలు వేద శ్రీ (దివ్య భారతి) – అనంత రెడ్డి ల వివాహానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరైన నవదంపతులను ఆశీర్వదించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి సీఎం కేసీఆర్ గారి వెంట నడుస్తున్న గంగారెడ్డి, తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో 2006, 2011 లో రెండు సార్లు సీఎం కేసీఆర్ గారు జగ్గాసాగర్ లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. తమ గ్రామంలో సీఎం కేసీఆర్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించే గంగారెడ్డి, చుట్టు పక్కల గ్రామాల్లో సైతం ‘కేసీఆర్ గంగారెడ్డి’ గానే సుపరిచితుడు. ఎమ్మెల్సీ కవిత హాజరవడం పట్ల గంగారెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ గారిని అమితంగా అభిమానిస్తూ, తన ఇంటి పేరునే కేసీఆర్ గా మార్చుకున్న జగ్గా సాగర్, మెట్ పల్లికి చెందిన కేసీఆర్ గంగారెడ్డి గారి మనవరాలు వేద శ్రీ – అనంత రెడ్డిల వివాహానికి హాజరై నవదంపతులను ఆశీర్వదించడం జరిగింది pic.twitter.com/AKqqeQCP2J
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 9, 2020