కోమాలోనే మాజీ రాష్ట్రప‌తి ప్రణబ్‌

న్యూఢిల్లీ: భార‌త మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంద‌ని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుప‌త్రి వెల్ల‌డించింది. తాజాగా ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, వెంటిలేటర్ తో కృత్రిమ శ్వాస అందజేస్తున్నామని ఆసుప‌త్రి వ‌ర్గాలు బుధవారం తెలిపాయి. మెద‌డులో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డంతో ఆగ‌స్టు 10వ తేదీన ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఢిల్ల‌లోని ఆర్మీ ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు కోవిడ్ ప‌రీక్ష చేయ‌గా క‌రోనా పాజిటివ్ సోకిన‌ట్లు తేలింది. గ‌త 16 రోజులుగా ప్రణబ్‌ దవాఖానలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉండడం వల్ల ప్రణబ్‌కు చికిత్స అందజేస్తున్నామని, నిన్నటి నుంచి ఆయన మూత్రపిండాలు కూడా క్షీణిస్తున్నట్లు కనబడుతోందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యులు ప్ర‌ణ‌బ్ ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.