కరోనా దవాఖానలో అగ్నిప్రమాదం.. 13 మంది మృతి

ముంబయి: మహారాష్ట్రలోని ఓ కరోనా ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది రోగులు అగ్నికి ఆహుతయ్యారు. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో చికిత్స పొందుతున్నవారిలో 13 మంది సజీవ దహణమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.