క‌ర్నూలు విమానాశ్ర‌యం ప్రారంభించిన జ‌గ‌న్‌

ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు

క‌ర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి విమానాశ్ర‌యంగా నామ‌క‌ర‌ణం చేశారు. ఇండిగో సంస్థ మార్చి 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు మౌలిక వసతులను కల్పించారు.

ఈ సంద‌ర్భంగా సిఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. గాంధీ, వల్లభా భాయ్ పటేల్ ల కంటే ముందుగానే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి, ప్రజల తరపున పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడితేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ నెల 28 నుంచి ఓర్వ‌క‌ల్లులో విమానాల రాక‌పోక‌లు ప్రారంభ‌మ‌వుతాయి… ప్రారంభంలో బెంగ‌ళూరు, చెన్నై, విశాఖ‌కు స‌ర్వీసులు.. ఇది రాష్ట్రంలో ఆరో విమానాశ్ర‌యం అని సిఎం అ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.