ఖ‌మ్మంలో ఐటి హ‌బ్ ప్రారంభించిన కెటిఆర్‌

ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఇత‌ర కార్పొరేష‌న్ల‌కు ఆద‌ర్శం...

ఖ‌మ్మం : పెద్ద న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు ప‌రిమిత‌మైన ఐటి రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల‌కు విస్త‌రించాల‌న్న ల‌క్ష్యంతోనే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఐటి హ‌బ్‌ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి కెటిఆర్ అన్నారు. ఖ‌మ్మం జిల్ల‌లో నూత‌నంగా నిర్మించిన ఐటి హ‌బ్‌తో పాటు దాదాపు రూ. 150 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల‌ను మంత్రి ప్రారంభించారు. న‌గ‌రం న‌డిబొడ్డున చేప‌ట్ట‌ని ఐటి హ‌బ్ ఆరు అంత‌స్తులను ప‌రిశీలించారు. వివిధ ఐటి సంస్థ‌ల‌కు కేటాయించిన భ‌వ‌నాల‌ను క‌లియ‌తిరిగారు. ఈ సంద‌ర్భంగా ఆయా సంస్థ‌ల ప్ర‌తినిదులు, అధికారుల‌తో మాట్లాడి ఐటి హ‌బ్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖ‌మ్మం జిల్లాలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. మంత్రి పువ్వాడ అజ‌య్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌తో అభివృద్ధి ప‌నులు పూర్తి చేయించుకున్నారు. మంత్రి పువ్వాడ వార్షిక నివేదిక ద్వారా ఖ‌మ్మం అభివృద్ధిని వివ‌రించారు. పువ్వాడ వంటి ప్ర‌జాప్ర‌తినిధి ఉండ‌టం ఖ‌మ్మం ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని చెప్పారు. రాష్ర్టంలో ఖ‌మ్మానికి మించిన కార్పొరేష‌న్ లేద‌న్నారు. ఖ‌మ్మం ర‌హ‌దారుల అభివృద్ధి కోసం రూ. 30 కోట్లు మంజూరు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని బుగ్గ‌పాడులో త్వ‌ర‌లో ఫుడ్ పార్క్ ప్రారంభిస్తామ‌న్నారు.

ఉమ్మ‌డి ఏపీలో ఐటీ అనేది హైద‌రాబాద్‌కే ప‌రిమితం అయ్యేది. ఐటీ ప‌రిశ్ర‌మ వికేంద్రీక‌ర‌ణ‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఐటీని ద్వితీయ శ్రేణి ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఖ‌‌మ్మం, వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, సిద్దిపేట‌లో ఐటీ హ‌బ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఖ‌మ్మం జిల్లాలోని నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఐటీ హ‌బ్‌లో 19 కంపెనీలు ప్రారంభించామ‌ని తెలిపారు. ఐటీ హ‌బ్ ఫేజ్-2 కోసం రూ. 20 కోట్లు త్వ‌ర‌లోనే మంజూరు చేస్తామ‌న్నారు.

 

Leave A Reply

Your email address will not be published.