గంగిశెట్టి మృతికి ఫొటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ యూనియన్ సంతాపం

మండపేట (CLiC2NEWS): ప్రముఖ ఫొటో గ్రాఫర్ గంగిశెట్టి సుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫైర్ అసోసియేషన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం ఆయన మరణానికి చింతిస్తూ ఫొటోగ్రాఫర్స్ యూనియన్ సంతాపం ప్రకటించింది. సుబ్రహ్మణ్యం మండపేట అసోసియేషన్ లోనే కాకుండా చుట్టూ పక్కల అసోసియేషన్ లో ఉండే అందరి తో స్నేహ పూర్వకంగా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి లేకపోవడం బాధాకరం అని రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్కా రాంబాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా అన్నారు. అసోసియేషన్ కి వెన్నంటే ఉండే వ్యక్తి , కష్టించి చిన్న స్థాయి నుండి నిలదొక్కుకుని ఫోటో, వీడియోగ్రఫీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని అన్నారు. మండపేట జోన్ అధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, కార్యదర్శి దివాకర్, కోశాధికారి బృందావనం సాయి, సహాయ కార్యదర్శి కాకపర్తి శ్రీనివాస్, సహాయ కోశాధికారి కాకి డానియేలు, కార్యవర్గ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.