గుంటూరులో రోడ్డుప్రమాదం: ముగ్గురు మృతి

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఐదులాంతర్ల సెంటర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి ధూళ్లిపాళ్లకు వెళుతున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.