గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు కూలీలు మృతి

గుంటూరు (CLiC2NEWS): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. పలువురు కూలీలు గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారికి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.