Gujarat: ఘోర రోడ్డు ప్రమాదం,10 మంది మృతి

గుజరాత్(CLIC2NEWS): గుజరాత్లోని ఆనంద్ జిల్లా ఇంద్రనాజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ట్రక్కు, కారుని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది.