గుట్కా తదితర అక్రమ వ్యాపారా దందాలపై కేసులు నమోదు చేస్తాం: జైపూర్ ఎసిపి జి నరేందర్

జైపూర్ (CLiC2NEWS): అక్రమ గుట్కా రవాణా చట్టరీత్యా నేరమని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. గుట్కా రవాణా, విక్రయాలపై తమకున్న సమాచారం మేరకు దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది అన్నారు.
జైపూర్ సబ్ డివిజన్ ప్రాంతంలో నిషేధిత “గుట్కా, అంబర్ ఖైనీ, ఫుల్ఛాప్” వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రామగుండం పోలీస్ కమీషనర్”వి సత్యనారాయణ ఐపీఎస్” గారి ఆదేశాల మేరకు ఇప్పటికే జైపూర్ డివిజన్లో పోలీసు దాడులను ముమ్మరం చేశాం. అనేక మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. లక్షల రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం పర్చుకున్నాం. గుట్కా, ఖైనీ, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ విషయాన్ని వ్యాపారులు గ్రహించి నిషేధిత వ్యాపారాన్ని పూర్తిగా మానుకోవాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. నిషేధిత వస్తువుల గురించి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి.“ అని తెలిపారు.
గుట్కా ఇతర మరిన్ని అక్రమ వ్యాపారా దందాలపై ఉక్కుపాదం మోపుతాం అన్నారు. జాబితా సిద్ధం చేస్తున్నాం, ఏ తరహా అక్రమాలకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ప్రజలకు పోలీసు ల మైన మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము అని సాదారణ జీవితం గడిపే వారికీ మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ నేరాలకు పాల్పడే వారికీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికీ కాదు అని అన్నారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ వారి స్వేచ్ఛా భంగం కలిగేంచే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజల భద్రతే జైపూర్ పోలీసు లక్ష్యం అని ఏసీపీ నరేందర్ తెలియజేశారు.