గురుకులాల్లో ఇంట‌ర్ ప్ర‌వేశాల‌కు చివ‌రి తేదీ నేడే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిభ కాలేజీల్లో ప్రవేశాల ఆన్‌లైన్ ద‌రఖాస్తుల‌కు నేడే ఆఖ‌రు తేదీ. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో (2020-21) పదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.లక్షా 50 వేలలోపు ఉండాలి.

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 33, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 ప్రతిభ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఇంటర్‌తోపాటు ఐఐటీ, నీట్‌, జేఈఈ, ఎంసెట్‌, సీఏ, సీపీటీ, క్లాట్‌, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో, అప్లికేషన్‌ ఫీజు: రూ.100, దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 20, వెబ్‌సైట్‌: tswreis/tgtwguruklam

Leave A Reply

Your email address will not be published.