గొప్ప మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇవాళ తన నియోజకవర్గ పరిధిలోని కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించారు ఎంపి రేవంత్ రెడ్డి. మాల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీని 50 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేసి చికిత్స అందించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్‌సీని దతత్త తీసుకుని నియోజకవర్గ ప్రజలకు కోరనా చికిత్స అందించేందుకు తన సొంత నిధులు, ఎంపీ నిధులు ఖర్చు చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 20 రోజుల క్రితం పనులు ప్రారంభం అయ్యాయి. 50 ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యంతో కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు బొల్లారం ఆసుపత్రి రెడీ అయింది.మొదటి దశలో 50 పడకల సౌకర్యంతో పాటు,50 సిలెండర్ల ఆక్సిజన్,ఇతర వైద్య సిబ్బంది,అవసరమైన మందులు,వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేశాం.నా నియోజకవర్గంలో ప్రజలకు కష్టకాలంలో ఇది కొంతైనా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాను pic.twitter.com/MiFlr4jCaN
— Revanth Reddy (@revanth_anumula) May 23, 2021