`గ్రేటర్`ఎన్నికలకు నేడు నోటిఫికేషన్?

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నగారా మోగనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.
తుది ఓటరు జాబితా, పోలింగ్‌స్టేషన్ల ముసాయిదాతో పాటు ఎన్నికల పరిశీలకుల నియామకాలు చేపట్టింది. అలాగే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ సైతం ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు, పోలీసులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో సీఈసీ మీడియా సమావేశం నిర్వహిస్తుండడంతో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందని తెలుస్తోంది.