గ్రేటర్ ఫైట్: టిఆర్ ఎస్ తొలి జాబితా ఇదే

హైదరాబాద్ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిపై దృష్టి పెట్టాయి. ఈ విషయంలో మిగతా పార్టీల కంటే టీఆర్ఎస్ అందరి కంటే ముందు నిలిచింది. తొలి విడుత 105 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కలిసొచ్చేలా 105 మందితో తొలి జాబితా రూపొందించారని సమాచారం.