ఘోరం: మర్మావయవాలు కోసి చంపారు !

రామాపురం: కడప కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న రామాపురం మండలం నల్లగుట్ట పల్లి వద్ద ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా నరికి చంపారు అని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 సంవత్సరాల వయస్సు గల మృతుడి ముఖం మీద తీవ్రంగా గాయాలు చేసిన గుర్తులు ఉండగా అతని మర్మావయవాలు కూడా కోశారు. కాళ్లు చేతులు కూడా నరికి వేరు చేయడం తో అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి ని గుర్తు పట్టలేని విధంగా అతి కిరాతకంగా నరికిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచో గుర్తుతెలియని వాహనంలో మృతదేహాన్ని ఆ ప్రాంతంలో వేయడాన్ని అక్కడి పశువుల కాపరుల గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వాహన వివరాలు సేకరించేందుకు గువ్వల చెరువు,బండపల్లి టోల్ ప్లాజా దగ్గర ఉన్న సీసీ ఫుటేజీ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన పై లక్కిరెడ్డిపల్లె సీఐ యుగంధర్ రామాపురం ఎస్ఐ మైనుద్దీన్ లు మృతదేహాన్ని పరిశీలించి ,హత్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.