చైనాలోనూ మోడీ హవా!.. వెల్లడించిన చైనా అధికారిక పత్రిక

న్యూఢిల్లీ : ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు కేవలం భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.. విదేశాల్లో మోడీకి భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. దానికి నిదర్శనం అమెరికాలో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమం.. ఈ ఈవెంట్కు లక్షలాది మంది అమెరికన్లు హాజరయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. కేవలం అమెరికాలోనే కాదు మన పొరుగుదేశం చైనాలో కూడా ప్రధాని మోడీకి అభిమానులున్నారంటా.. ఇది చైనా అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని అభిమానించే వ్యక్తులు చైనాలో కూడా ఎక్కువ మోతాదులోనే ఉన్నారని.. చైనా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
చైనా నాయకుల కంటే కూడా మోడీకే ప్రజలు పట్టం కట్టారంటా.. అక్కడి నేతల కంటే మోడీనే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారని రాసుకొచ్చింది. సగం మంది ప్రజలు చైనా నాయకులకు అనుకూలంగా ఉండగా.. మరో సంగం మంది మోడీకే పట్టం కట్టారని రాసుకొచ్చింది. అలాగే చైనా వ్యతిరేక భావన భారత్లో విపరీతంగా ఉందని కూడా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.