చలికాలం : కరోనా ప్రభావం..!
చలికాలంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని కొద్దిరోజులుగా సైంటిస్టులు సూచిస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో ప్రపంచం కరోనావైరస్ ‘సెకెండ్ వేవ్’ ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వైరస్ ఇంతకు ముందుకంటే ప్రాణాంతకం కావచ్చని హెచ్చరిస్తున్నారు. ఉత్తరార్ధ గోళంలోని దేశాలకు ఇది ఆందోళన కలిగించే అంశం కాబోతోందని చెబుతున్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, ఇప్పటి కన్నా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అంటున్నారు.
రానున్న రోజుల్లో కరోనా ప్రభావం పెరుగుతుందనే అంచనా వేస్తున్నారు. చలికాలం కాబట్టి కరోనా ఉగ్ర రూపాన్ని దాల్చుతుంది. చలి తీవ్రత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటంతో వైరస్ మళ్లీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.రాష్ట్రంలో కరోనా రెండోసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. చలి కాలం ప్రారంభం కావడం తో ఫ్లూ వైరస్ పంజా విసురుతుందని అంచనా వేస్తోంది. అలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు వైద్య సిబ్బందికి సూచించారు.
ఒకసారి సోకే ఇన్‌ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10శాతం తగ్గుతూ ఉంటుంది. పదే పదే ఇన్‌ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి చలికాలం కరోనాతో పాటు ఇతరత్రా సీజనల్ ఇన్‌ఫెక్షన్ల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఈ జాగ్రత్తలు పాటించండి:
- ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్ కట్టుకోవాలి.
- సాధారణ జలుబునూ నిర్లక్ష్యం చేయకూడదు
- ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వైద్యులను కలవటం తప్పనిసరి.
- నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది.
- డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లవల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది
- ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసీ గదులకు దూరంగా ఉండడం మంచిది. జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవటమే మంచిది.