జనగామ నరేష్: నేడు మేడే.. దీక్షా దినం!

శ్రామిక దోపిడీ నిరసిస్తూ, యావత్ ప్రపంచ కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ, పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించి, కార్మికవర్గం పిడికిలి బిగించి, నినదించి, యావత్ ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల హక్కుల సాధనకు బాటలు వేసిన చారిత్రాత్మక రోజే ఈ “మేడే”.

ప్రపంచవ్యాప్తంగా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా, కార్మిక పోరాటాల ఐక్యతను, కార్మికలోకం వారి త్యాగాలను స్మరించుకుంటూ చేసే గొప్ప పోరాట కార్యక్రమం మేడే. దీని వెనుక చారిత్రక పోరాటం దాగి ఉంది, అదేమిటంటే అమెరికాలోని చికాగో నగరంలో 1886లో మే 1వ తారీఖున కార్మికుల రక్తం తమ దేశంలో ఉండే కార్మికుల హక్కులకే కాకుండా యావత్ ప్రపంచానికి కార్మికుల జీవితాలను వెలుగు బాట అయ్యింది.

ఆ రోజులలో కార్మికుల పని గంటలను రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేయాల్సి ఉండేది. అయితే కార్మికులు ఎనిమిది గంటల పని విధానం రావాలని అమెరికాలోని చికాగో నగరంలో భారీ శక్తి ప్రదర్శన చేశారు. ఈ ఉద్యమంను అణచివేయాలని అక్కడి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పినారు. అప్పుడు రెచ్చిపోయిన పోలిసులు విచ్చల విడిగా కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పులలో అనేక మంది కార్మికులు చనిపోయారు. చాల మంది కార్మికులు వీరోచితంగా పోరాడారు. తరువాత ఈ యొక్క పోరాటం అనేక ప్రపంచ వ్యప్తంగా అనేక దేశాలకు వ్యాపించి అనేక దేశాల్లో కూడా రోజుకు ఎనిమిది గంటల మాత్రమే పనిగంటలు ఉండాలని, చికాగో నగరంలో జరిగిన కార్మిక పోరాటానికి మద్దతుగా అనేక ప్రదర్శనలు జరిగాయి. చాలా దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.

ప్రపంచ మేధావి కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్మిక వర్గం పైన గొప్ప ప్రభావం చూపించింది.

ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా కార్మిక వర్గాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు రావడం జరిగింది.

అదేవిధంగా భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత ప్రజల ఆశాజ్యోతి బాబాసాహెబ్ డా.బి.అర్.అంబేద్కర్ భారత దేశంలో కార్మిక మంత్రిగా విశిష్ట సేవలుచేశారు. కనీస వేతనాల చట్టం -1948, సమాన ప్రతిఫలము చట్టం, బోనస్ చెల్లింపు చట్టం -1965, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం- 1972, కార్మిక బీమా చట్టం ప్రసూతి ప్రయోజనాల చట్టం బాల కార్మిక నిషేధ చట్టం ఇలా అనేక చట్టాలను భారతదేశ వ్యవస్థలో ప్రవేశపెట్టి కార్మికుల సంక్షేమం కొరకు కార్మికుల మధ్య తారతమ్య భేదం లేకుండా వారి కొరకు ఈ దేశంలో పని చేసిన మహనీయుడు అంబేద్కర్.

ప్రస్తుత ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తు అనేక ప్రభుత్వరంగ సంస్థలను, ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి.

అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకువచ్చి హక్కులు కలగకుండా కార్మికులను శ్రమదోపిడి చేస్తూ, ఉన్నటువంటి కుట్రలకు తెరలేపి, అవి నిమగ్నం చేయడంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ మెప్పు పొందేలా పనిచేస్తున్నాయి.

కావున మేడే సందర్భంగా ప్రపంచ మేధావులు కార్ల్ మార్క్స్ మరియు డా.అంబేడ్కర్ స్ఫూర్తితో కార్మికులు హక్కుల సాధన, సంక్షేమం కొరకు పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక లోకం చేసినటువంటి అనేక కార్యక్రమాలు విజయవంతమైన చరిత్ర దేశంలో, అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. కార్మికులు లేనట్లయితే ఏ వస్తువు ఉత్పత్తి కావడం అనేది జరగదు. కాబట్టి కార్మిక వర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు అందరిపైనా ఉందనే విషయాన్ని గుర్తు ఎరిగి కార్మిక హక్కుల కోసం బుద్ధి జీవులు కూడా తమ వంతుగా కార్మికులతో కలిసి ఐక్య పోరాటాలలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, భవిష్యత్ రానున్న రోజుల్లో కార్మికుల తలపెట్టే, ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని అందుకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కార్మిక లోకానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం.

-జనగామ నరేష్
న్యాయవాది, బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
సెల్‌: 9949200562

Leave A Reply

Your email address will not be published.