జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ సమీక్షా సమావేశం

హైద‌రాబాద్ (CLiC2NEWS): జీహెచ్ఎంసీ చేపట్టే అభివృద్ధి పనుల వద్ద, జలమండలి ఆధ్వర్యంలో జరుగుతున్న పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎండీ దాన కిషోర్, ఐఏఎస్ జలమండలి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయం లో శనివారం జలమండలి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్సార్డీపీ, ఆర్వోబీ (రోడ్ ఆన్ బ్రిడ్జి), ఎఫ్వోబి తదితర అభివృద్ధి పనుల వద్ద జరుగుతున్న జలమండలి పైప్ లైన్ మళ్లింపు, విస్తరణ వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అవసరమైతే రెండు శాఖల అధికారులు సంయుక్తంగా ఈ పనులను సందర్శించి, సమన్వయంతో పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జలమండలి ఈఎన్సీ, డైరక్టర్ ఆపరేషన్స్ -1 అజ్మీరా కృష్ణా, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, సీజీఎంలు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సరోజా రాణి, దత్ పంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.