జైపూర్‌లో ఘ‌నంగా సుభాష్ చంద్ర‌బోస్ జ‌యంతి

జైపూర్: సుభాష్ చంద్ర‌బోస్ 150వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జైపూర్ మండ‌ల కేంద్రంలో ఆయ‌న జ‌యంతి ఉత్స‌వాల‌ను శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సుభాష్ చంద్ర‌బోస్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ శుభదినం సంద‌ర్భంగా మండ‌ల కేంద్రంలోని త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ప‌క్క‌వీధికి కాలనీ వాసులు సుభాష్ చంద్ర‌బోస్ న‌గ‌ర్ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ మేర‌కు వీధిలో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లింగస్వామి, టిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, మాజీ సర్పంచ్ భీమిని రాజయ్య, కాలనీ వాసులు బండారి శ్రీనివాస్, ఎండీ అజీజ్, బండి చంద్రమోహన్, రాజు పటేల్, పారిగం శ్రీను, బండారి లక్ష్మి, సంగీత, రఫియా, లీలావతి, సాత్విక్, సన్నిత్, గణ ముక్కల సాయి తేజ, బండి సాయికృష్ణ, ఎండి ముస్తఫా, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.