టిటిడికి ఓ భక్తుడు రూ.300 కోట్ల విరాళం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానికి ఓ భక్తుడు రూ. 300 భారీ విరాళం ప్రకటించారు. ముంబయికి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడ భారీ ఆస్పత్రిని కట్టిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆ భక్తుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 300 పడకలతో ఆ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ ఒప్పందం గురించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది.