టిమ్స్‌లో 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించిన కెటిఆర్

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ‌చ్చిబౌలి టిమ్స్ లో హైసియా ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్‌ను రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్ శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. అనంత‌రం క‌రోనా వార్డుల‌ను కెటిఆర్ సంద‌ర్శించారు. వార్డుల్లో క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి.. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా హైసియా స‌భ్యుల‌కు కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా కెటిఆర్ ప్ర‌సంగిస్తూ.. ప్ర‌స్తుత లాక్‌డౌన్ ముగిసేలోగా రెండో ద‌శ తీవ్ర‌త త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్నారు. మ‌ళ్లీ సాధార‌ణ జీవ‌నం గ‌డిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వైద్యులు అంచ‌నా వేస్తున్నారు అని తెలిపారు. వైద్య సిబ్బందికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక‌నైనా కేంద్రం మేల్కొని విదేశాల్లోని టీకాలు తెప్పించాల‌ని సూచించారు. టిమ్స్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌తో పాటు వైద్యుల స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి కెటిఆర్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.