టి.వేదాంత సూరి: ఓటు వేయండి ప్లీజ్!

రేపే ఎన్నికలు, కార్యాలయాలకు, వ్యాపార సంస్థలకు సెలవు. ఎందుకు? అందరూ ఓటు వేయాలని, కానీ చాలావరకు హైదరాబాద్ లో ఓటు వేయకుండా. ఆరోజు సెలవు రోజుగా భావించి ఇంట్లో టి.వి. మూడు కంప్యూటర్ మూడు లేదా సెల్ ఫోన్ లో స్నేహితులతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తారు. ప్రభుత్వం ఎందుకు సెలవు ఇచ్చింది అసలు పట్టించుకోరు. ఇది కేవలం నగర పౌరుల బాధ్యతా రాహిత్యం. ఐదేళ్లు నాయకులను, ప్రభుత్వాలను, వ్యవస్థలను తిట్టుకుంటూ కూర్చున్నవారు ఒక అరగంట వెచ్చించి ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గు చేటు. అలాంటి వారికి విమర్శించే హక్కు ఉండదు. అసలు వారికి పౌర సేవలను నిలిపి వేయాలి.. గ్రామాలలో వోటింగ్ ఎక్కువగా ఉంటే పట్టణాలలో సగం కూడా ఉండకుంటే ఏమనుకోవాలి. మీరు వేయకుంటే మీ ఓటును సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలచుకుని దొంగ ఓట్లకు పాల్పడుతారు జాగ్రత్తగా వుండండి రేపు సాధ్యమైనంత తొందరగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసిరండి. మీకు నచ్చినవారికి వేయండి, లేదా ఎవరూ నచ్చడం లేదని నోటాకు వేసిరండి కానీ ఇంట్లో కూర్చోకండి. అలంటి వారు దేశ ద్రోహుల లెక్కలోకి వస్తారు. బాధ్యతలను విదేశీయుల ద్వారా నేర్చుకోండి.

(టి.వేదాంత సూరి: ఓటరూ! ఒక్క సారి ఆలోచించండి.. తస్మాత్ జాగ్రత్త..)

మన దేశాన్ని మనం అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ పని రాజకీయ నాయకులది కాదు. మీది. మీరు ఎంచివారిని ఎంపిక చేసుకుని ఎన్నుకుంటే ఐదేళ్లు సుఖఃముగా వుండొచ్చు. లేదంటే క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీయ వలసి వస్తుంది. వ్యక్తులను అంచనా వేయడం అలవాటు చేసుకోవాలి. ఇన్నాళ్ల అనుభవాలను బేరీజు వేసుకోవాలి, ఈ వ్యవస్థ బాగులేదంటే బాధ్యత కూడా మీదే. మీరు పన్నులు కడుతున్నారు, తగిన సేవలను పొందాలనంటే మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు జూలు విడులుస్తాయి, అప్పుడు బాధపడి లాభంలేదు. సురక్షితమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, మీకు సేవలు నిజాయితీగా అందించే వారికి ఓటు వేయండి. మీ ఓటుకు నిజాయితీ, నిబద్ధత, సేవాతత్పరత మాత్రమే ఉండేలా చూసుకోవాలి. వారెవ్వరో నిర్ణయించేది మీరే. మిమ్మల్ని మీరు తక్కువా అంచనా వేసుకోకండి. ఇన్నాళ్లు నాయకుల హామీలు విన్నారు, వారి వ్యక్తిత్వాలు తెలుసుకున్నారు. ఎవరొస్తే ఏం చేస్తారో తెలుసు ఇప్పుడు మీరు చేయాల్సింది ఆలోచించడం, ఎవరు మీకు, మీ పొరుగు వారికి, సమాజానికి ఉపయోగ పడతారో నిర్ణయించుకోవడం వారిని ఎన్నుకోవడం ఈ దేశంలో బాధ్యతగల పౌరులు మీరు. జాగ్రత్తగా అలోచించి మీ ఓటు వేసి రండి..

-టి.వేదాంత సూరి

Leave A Reply

Your email address will not be published.