తాడేపల్లి లో జగన్ పుట్టిన రోజు వేడుకలు..

తాడేపల్లి (అమరావతి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా.. సోమవారం సిఎస్ నీలం సాహ్ని, డిజిపి గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి లు జగన్ నివాసంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన, పెద్దిరెడ్డి, బాలినేని, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్, వైవి సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు.
(తప్పక చదవండి: జనం మెచ్చిన జననేత జగన్)
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు. pic.twitter.com/Pmy4sN4gqG
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 21, 2020