తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు

హైదరాబాద్ (clic2news): రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 5,567 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.73 లక్షలకు చేరింది. రాష్ట్రంలో తాజాగా కరోనాతో 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1899కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3.21 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 989, మేడ్చల్లో 421, రంగారెడ్డిలో 437, నిజామాబాద్లో 367, మహబూబ్నగర్లో 258 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు మొన్నటి నుంచి తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు.