తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 862 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు మృతి చెందారు. ఇదే సమయంలో కరోనాబారినపడిన 961 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,904కు పెరగగా రికవరీ కేసులు 2,54,676కు చేరాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,444 మంది కరోనాతో మృతిచెందారు. రోవైపు. కరోనా మరణాల సంఖ్య భారత్‌లో 1.5 శాతంగా ఉంటే. రాష్ట్రంలో 0.54 శాతానికి తగ్గిపోయిందని రికవరీ రేటు దేశవ్యాప్తంగా 93.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.41 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,784 యాక్టివ్ కేసులు ఉండగా, అందులో 8,507 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇక, గత 24 గంటల్లో తెలంగాణలో 41,101 కరోనా శాంపిల్స్ పరిక్షించారు. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 52,89,908కు పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.