తెలంగాణలో కొత్త‌గా 921 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 42,740 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 921 మందికి పాజిట‌వ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం కరోనా బులెటిన్ విడుద‌ల చేసింది. గత 24 గంటల్లో  1,097 మంది రికవరీ అయ్యారు. మరో నలుగురు కరోనాబారినపడి మృతిచెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,049కు చేరుకోగా.. ఇప్పటి వరకు 2,52,565 మంది కరోనాబారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. 1,437 మంది మృతిచెందారు.

మరోవైపు.. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.54 శాతానికి తగ్గిపోయిందని.. రికవరీ కేసుల సంఖ్య దేశంలో 93.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.28 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో 11,047 యాక్టివ్‌ కేసులు ఉండగా.. వారిలో 8,720 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,740 కరోనా టెస్ట్‌లు చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 52,01,214కు పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. తాజా కేసుల్లో హైదరాబాద్‌లో అత్యధికంగా 146 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కాగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది… ఆదివారం రోజు టెస్ట్‌ల సంఖ్య తగ్గడంతో తగ్గిపోయిన కేసులు.. ఇక, సోమవారం మళ్లీ టెస్ట్‌ల సంఖ్య పెరగడం కూడా పాజిటివ్‌ కేసుల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు..

Leave A Reply

Your email address will not be published.