Telangana: యుద్ధ విమానాల్లో ఆక్సిజ‌న్

తెలంగాణ‌కు యుద్ధ విమానాల్లో ఆక్సిజ‌న్
హైద‌రాబాద్:
దేశంలో క‌రోనా క‌ట్ట‌డికోసం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కోసం తెలంగాణ స‌ర్కార్ యుద్ధ విమానాల‌ను ఉప‌యోగిస్తోంది. ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌తో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌కు ఈ ఉద‌యం బ‌య‌ల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను భువ‌నేశ్వ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.

మంత్రి కెటిఆర్ అభినంద‌న‌లు
ఈ ప్ర‌క్రియ‌ను ద‌గ్గరుండి ప‌ర్య‌వేక్షించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌ను మంత్రి కెటిఆర్ అభినందించారు.

ఆక్సిజ‌న్‌ను రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలోనే తొలిసారిగా యుద్ధ విమానాల‌ను ఉప‌యోగిస్తోంది. 3 రోజుల స‌మ‌యంతో పాటు, ఎంతో మంది విలువైన ప్రాణాల‌ను కాపాడేందుకు ఈ ప్ర‌య‌త్నం దోహ‌ద‌ప‌డుతుంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.