తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఇలా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం 1,50,326 ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 1,26,641 యామకాలు పూర్తయ్యాయి ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 ఉద్యోగ నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి. గత ఆరున్నరేండ్లలో టీఎస్పీఎస్సీ 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి నోటిఫికేషన్లు రానున్నాయి.