తెలంగాణ కొత్త‌గా 111 కరోనా కేసులు

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంటల వ్య‌వ‌ధిలో 111 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిలెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,011కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,96,562కు పెరిగాయి. కాగా తాజాగా ఒక‌రు మ‌ర‌ణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 1642 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో గ‌త 24 గంటల్లో తాజాగా కరోనా నుంచి 189 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,807 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 689 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.