తెలంగాణ వైద్యులకు శుభవార్త

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వ వైద్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనాన్ని రూ.70 వేల నుంచి రూ. 80,500లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ పెరిగిన స్టైఫండ్ ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.