తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు బుధవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పతనమవుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లోనూ క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల పుత్తడి రూ.232 దిగి రూ. 47,387కు పరిమితమైంది. వెండి కిలో రూ.1,955 పడిపోయి రూ.67,605కు వచ్చింది. బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకం తగ్గింపుతో ధరలు దిగివస్తున్నాయని నిపు ణులు పేర్కొంటున్నారు.