దేశంలో కొత్తగా 44,263 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 44,263 కరోనా కేసులు నమోదు కాగా.. 547 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 87,28,180కు చేరింది. 1,28,668 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 4,84,547 యాక్టివ్ కేసులుండగా.. కరోనా చికిత్స నుంచి కోలుకుని 81,15,580 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 92.97 శాతం కాగా.. మరణాల రేటు 1.47 శాతంగా ఉందని శుక్రవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.