నాన్న పరిస్థితిపై నేనే ఆప్‌డేట్ ఇస్తా: ఎస్పీ చరణ్

చెన్నై : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ పలు వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై స్పందించిన చరణ్ అవన్నీ అవాస్తవం అని అన్నారు. నాన్న ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆరోగ్యం కొంత నిలకడగానే ఉంది. నాన్న ఆరోగ్యం గురించి నేనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తాను పుకార్లు నమ్మోద్దంటూ చరణ్ కోరారు. తన తండ్రి ఆరోగ్యంపై వివరాలను ఎప్పకటికప్పుడు తానే అందిస్తానని, ఏ విషయమైనా.. తన ద్వారానే తెలుస్తుందని సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.
కాగా, ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతోందని, తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చిదంటూ ఎస్పీ చరణ్ పేరిట సోమవారం ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల అయింది. దీంతో ప్రపంచమంతా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ వార్తలు పుకార్లంటూ ఎస్పీ చరణ్ ఖండించడంతో ఎస్పీ బాలు ఫ్యాన్స్ నిరాశ చెందారు. కాగా, ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. బాలుకు ప్రస్తుతం ఎంజీఎం వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సపోర్ట్‌తో చికిత్స జరుగుతుంది కాగా, ఈ నెల 5న ఎస్పీ బాలు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 14 వ తేదీ వరకు బాగానే బాలుకి ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో 19 నుండి ఎక్మో చికిత్స మొదలు పెట్టారు. త్వరగా కోలకుకోవాలని అశేష సినీలోకం ప్రార్ధిస్తుంది.