నా బిడ్డను ఆశీర్వదించండి..సీఎం కేసీఆర్ కు రైతు ఆహ్వానం

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని తన పొలం నుంచే వినిపించిన రైతు ఫణికర మల్లయ్య సోమవారం సీఎం కేసీఆర్ ను కలిశారు. మల్లయ్య తన కుమార్తె పెండ్లి కార్డును సీఎం కేసీఆర్ కు అందజేసి..వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నరనే సంతోషంతో, నాటి ఉద్యమ సారధి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను తన బిడ్డ పెండ్లికి ఆహ్వానించడానికి వచ్చానని ఈ సందర్బంగా ఫణికర మల్లయ్య తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు శ్రీ ఫణికర మల్లయ్య, తన కుమార్తె పెండ్లి కార్డును సీఎం శ్రీ కేసీఆర్ కు అందించి ఆహ్వానించారు. pic.twitter.com/6fh9Zk3NZn
— Telangana CMO (@TelanganaCMO) December 7, 2020