నిపుణుల హెచ్చరిక: కరోనా సోకితే అంగస్తంభన సమస్యలు..!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మాయదారి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు రోజుకోటి తరహాలో కొత్తకొత్తవి వెలుగులోకి వస్తున్నాయి. కరోనాబారినపడినవారి శరీరాన్ని ఆ వైరస్ గుల్ల చేస్తుందనే వార్తలు కూడా కలరపెడుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. వైరస్ సోకి, దాని నుంచి బయటడినా వారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా కోవిడ్ బారినపడిన పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటువ్యాధుల నిపుణులైన డాక్టర్ డేనా గ్రేసన్ దీనిపై స్పందిస్తూ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీకా వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరై కాడిపడేయొద్దని సూచించారు.
కొత్తపెళ్లికొడుకు కొంప ముంచిన భౌతిక దూరం..!
‘‘కరోనా వైరస్ రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని మాకు తెలుసు. ఫలితంగా పురుషుల్లో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. వైరస్ మనల్ని చంపడమే కాదు, వాస్తవానికి దీర్ఘకాలిక, జీవితకాల, సంభావ్య, సమస్యలకు కారణమవుతుంది’’ అని గ్రేసన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నప్పటికీ వైరస్ కారణంగా నాడీ సమస్యలు సహా దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశం ఉందని గ్రేసన్ హెచ్చరించారు.