నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నేడు హైద‌రాబాద్‌లోని ప‌లు దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10.15 నిమిషాల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని ఉపరాష్ట్రపతి ఇంటి నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట ఫ్లైఓవర్‌ రూట్లలో ట్రాఫిక్‌ నిలిపివేయనున్నారు. అలాగే ఆయా దారుల్లో వెళ్లే వాహనాలను దారిమళ్లించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిర్ణీత సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని నగర ట్రాఫిక్‌ అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.