నేడోరేపో.. పదో తరగతి ఫలితాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఇవాలో.. రేపో వెలువడే అవకాశముంది. ఫలితాల విడుదలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. కరోనా ఉధృతి కారణంగా వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు విద్యాశాఖ మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి గ్రేడ్లు కేటాయించింది. వీరిలో దాదాపు సగం కిపైగా విద్యార్థులకు ఈ సారి 10 జీపీఏ దక్కే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.