పాలేరు నుంచి బరిలోకి షర్మిల?

హైదరాబాద్: ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం తాను పోటీ చేసే స్థానం గురించి షర్మిల కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్సార్ కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలాగే అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఖమ్మం నేతలతో చెప్పినట్లు సమాచారం. ఇక ఏప్రిల్ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు.