ప్రణబ్‌ ముఖర్జీ ఇక‌లేరు

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ నేత ప్రణబ్‌ ముఖర్జీ మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం మరణించినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ ట్వీట్‌ చేశారు. ఈ నెల 10న ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స చేస్తుండగానే కోమాలోకి వెళ్లిన ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ప్రణబ్‌ ముఖర్జీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు.

ప్రణబ్ జీవిత చరిత్ర
ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న మిరాఠి గ్రామంలో జన్మించారు. ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతిశాస్త్రం), ఎల్‌ఎల్‌బీ, డీ.లిట్ (విద్యాసాగర్ కాలేజీ) వంటి విద్యార్హతలు సంపాదించారు. చదువు పూర్తయిన అనంతరం కొంతకాలం టీచర్, జర్నలిస్టుగా పనిచేశారు.

బ‌హుముఖ ప్ర‌జ్క్షాశాలి..
84 ఏళ్ల ప్రణ‌బ్ ముఖ‌ర్జీ భార‌త రాజ‌కీయాల్లో అత్యంత కీల‌క నేత‌ల్లో ఒక‌రు. యాభైయేల్ల సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో అనేక ప‌ద‌వులు నిర్వ‌హించారు. కాంగ్రెస్‌లో ట్ర‌బుల్‌షూట‌ర్‌గా పేరు పొందారు.

కుటుంబ నేప‌థ్యం..
ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మిరాటిలో 1935 డిసెంబ‌రు 11న ప్ర‌ణ‌బ్‌జ‌న్మించారు. ఆయ‌న తండ్రి కెకె ముఖ‌ర్జీ స్వాతంత్ర్య స‌మ‌రంలో క్రీయాశీల పాత్ర పోషించారు. కోల్‌క‌తా విశ్వ‌విద్యాల‌యం నుంచి ప్ర‌ణ‌బ్ న్యాయ‌శాస్ర్తంలో ప‌ట్టా పొందారు. సువ్రా ముఖ‌ర్జీని వివాహ‌మాడారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కురామారు, ఒక కుమార్తె.

రాజకీయ జీవితం

    • 1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
    • 1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక
    • 1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
    • 1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
    • 1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా…
    • 1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
    • 1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
    • 1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
    • 1982-84లో ఆర్థికమంత్రిగా..
    • 1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
    • 1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
    • 1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు
    • జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక
    • 2004-06లో రక్షణశాఖ మంత్రిగా..
    • 2006-09లో విదేశాంగమంత్రిగా..
    • 2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు
    • 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.