`ప్రభుత్వం వెంటనే 50 % ఫిట్మెంట్ తో PRC ప్రకటించాలి..`

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి తాలూకా TNGO కార్యవర్గ సమావేశం అధ్యక్షులు మహిపాల్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి TNGO జిల్లా అధ్యక్షులు దయానంద్ హాజరై ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 50 %ఫిట్మెంట్ తో PRC ప్రకటించాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో అనుమతించాలని,CPS విధానాన్ని రద్దు చేసి OPS విధానం తీసుకురావాలని, ఎల్లారెడ్డి పట్టణం మునిసిపల్ అయినందున HRA 14.5%ఇవ్వాలని,ఎల్లారెడ్డి లో పని చేసే ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే ఉద్యోగులందరు TNGO membership తీసుకోవాలని కోరారు.సమావేశం అనంతరం స్థానిక MLA గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఇట్టి కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి నరాల వెంకటరెడ్డి,తాలూకా కార్యదర్శి నరేష్,treasurer శరణ్, జిల్లా ఉపాధ్యక్షులు సాయిలు,organising సెక్రటరీ సయ్యద్ బాబా,తాలూకా కార్యవర్గ సభ్యులు అరుణ్,మధుకర్ లు పాల్గొన్నారు.