ప్రేమించాలనిపించే పెనిమిటి.. (షార్ట్ ఫిల్మ్ రివ్యూ)
సమీక్ష: “ప్రేమించాలనిపించే పెనిమిటి..“
షార్ట్ ఫిల్మ్: “ప్రేమించాలనిపించే పెనిమిటి..“
నటీనటులు: రామ్ మొగిలోజి, సీత మహా లక్ష్మి,
కథ: నాని బాబు
మాటలు: మనీష్ ముక్కెర
కెమెరా: మహేష్ వేముల
అసిస్టెంట్ డైరెక్టర్: కిషోర్. సి.హెచ్.
కో- ఎడిటర్స్: మహేష్ పాలోజి, కుమార్ స్వామి జంగ
స్క్రీన్ప్లే, ఎడిటింగ్, నిర్మాత, దర్శకత్వం: రామ్ మొగిలోజి
ఇదో లఘు చిత్రం, కరీంనగర్ లోని విరాట్ క్రియేషన్ వారు నిర్మించారు. ఇందులో రెండు ప్రధాన పాత్రలు, ఒకరు రామ్ మొగులోజి, రెండో వారు సీతా మహా లక్ష్మి. నటనలో ఇద్దరూ పోటీ పడ్డారు. అయితే సంభాషణల విషయంలో కొంత సహజత్వం రావాలి. ఈ మధ్య భార్యభర్తలు తీరిక లేకుండా ఉన్నారు. మరి కొందరి ఇళ్లల్లో ఇరువురు ఒకరినొకరు చూసుకోవడమే కష్టంగా మారింది. పైగా ఇద్దరు ఉద్యోగులు కావడం వలన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారిలో దాగి వున్న చిన్న, చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక పోతున్నారు.
బలం:
+ రామ్ మొగిలోజి, సీత మహా లక్ష్మి నటన
+డైరెక్షన్, కథ, మాటలు
బలహీనతలు
-బూతద్దంలో పెట్టి చూడాలి!
కానీ వారానికి ఒక గంట సేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకుంటే కొన్ని అపార్థాలు తొలగి పోతాయి. తమ మిత్రుడు ఇంటికి వస్తే అర్ధాంగిని పరిచయం చేయాలనే ఆలోచన కూడా ఉండదు. దీంతో ఆమె మనసు యెంత బాధ పడుతుందో ఇందులో స్పష్టంగా చూపించారు. ఇక వీరు ఇరువురు బయటకు వెళ్లి ఆనందించినట్టు కల కంటుంది భార్య.
అందులో నటన, పాట చిత్రీకరణ చాలా బాగుంది. ఒక సినిమాను తలపిస్తుంది. అంటే ఒక భార్య తనభర్త ఎలా ఉండాలో ఊహించుకుని కలలకు మాత్రమే పరిమితం కావాలా. స్త్రీకి ఒక హృదయం ఉంటుంది, ఒక మనసు ఉంటుంది అనే ఆలోచన పురుషుల్లో రానంత వరకు పరిస్థితుల్లో మార్పు రాదు. ఇరువురి నటన, దర్శకత్వం, కొరియోగ్రఫీ చాలా బాగుంది. టీం సభ్యులకు అభినందనలు.
–టి . వేదాంత సూరి
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.