ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ‌

హైద‌రాబాద్ : దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయ‌ని సీఎం అభిప్రాయపడ్డారు. దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని పేర్కొన్నారు. ‘‘సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి’’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

1 Comment
  1. Mallesh Yengani says

    అంటే మీరు కడుతున్న సచివాలయంను వలస పాలనకు గుర్తుగా నిర్మాణం ఉంది అని భావించి నూతనంగా నిర్మాణం చెప్పుట్టారా….!?

Leave A Reply

Your email address will not be published.