పరిగి గంజ్ రోడ్డులో దొంగల బీభత్సం

పరిగి: వికారాబాద్ జిల్లాలో షెట్టర్లను పగులగొట్టి దోపిడీ దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. పరిగి గంజ్ రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఇండియాకు సమీపంలోని ఐదు దుకాణాల షెట్టర్లను బుధవారం అర్ధరాత్రి విరగొట్టారు. బంగారం, చెప్పులు, కిరాణం, బట్టల దుకాణంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణంలో 5 తులాల బంగారం, 20 తులాల వెండిని అపహరించారు. దుకాణదారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు చోరీకి గురైన దుకాణాలను పరిశీలించారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.