‘బంద్’కు మద్దతివ్వం : బెంగాల్ సిఎం మమతా

కోల్‌కతా: రైతులకు వ్యతిరేకంగా మోడీ సర్కార్ చేసిన 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే సవరించాలని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సవరణ చేయడం కుదరకపోతే మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. వెస్ట్ మిడ్నాపూర్‌లోని ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. 2006 లో సింగూరు వేదికగా దాదాపు 26 రోజుల పాటు నిరశన చేసిన విషయాన్ని మమత ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగూరులో జరిగిన కార్యక్రమాన్ని తామెన్నడూ మరిచిపోమని తెలిపారు. తాము ‘బంద్’ కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని అయితే రైతుల డిమాండ్లకు మాత్రం పూర్తి మద్దతు ఉంటుందని ఆమె ప్రకటించారు. బయటి వారికి బెంగాల్ లో ఎప్పటికీ ప్రవేశం ఉండదని, బెంగాల్ ప్రజలు కూడా వారికి ఎన్నడూ ప్రవేశం కల్పించకూడదని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.