బెల్లంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు.

పండుగ‌లు వ‌చ్చిన‌పుడు మాత్ర‌మే మ‌నం బెల్లంను ఉప‌యోగిస్తాము. మిగ‌తా రోజులలో మ‌నం దానిగురించి ప‌ట్టించుకోము. కాని ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

మహిళలకు బాగా మేలుచేస్తుంది.

*రోజూ ఆహారంలో బెల్లం ఉండేలా చూసుకుంటే మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. రోజువారి ఆహారంలో బెల్లాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి తోడ్పడుతుంది. రుతుక్రమంలో వచ్చే చికాకులు, కడుపునొప్పి బెల్లంతో దూరమవుతాయి. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

*బెల్లాన్ని తరచూ తింటే రక్తశుద్ధి జరుగుతుంది. హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరగడానికి ఇది సహకరిస్తుంది. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

*శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దాని వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి సమస్యలు దూరమవుతాయి.

*బెల్లంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే నీరసం మీ దరిచేరదు.

*బెల్లంలో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలతో పాటూ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని అందిస్తాయి.

*మతిమరుపుతో (డిమెన్షియా) బాధపడుతున్నవారు రోజూ బెల్లం ముక్క తినాలి. ఇందులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. రోజూ పరగడుపునే కాస్త నేతిలో ముంచుకుని బెల్లం ముక్కని తింటే మంచి ఫలితాలు వస్తాయి.

*బెల్లం శరీరంలో క్లెన్సర్‌లా పనిచేస్తుంది. కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, శ్వాసకోశనాళం వంటి ముఖ్యమైన భాగాల్లోని మలినాలను తొలగించేందుకు సహకరిస్తుంది.

*బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నీరు చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా బరువు తగ్గచ్చు.

*రాత్రి పడుకోబోయే ముందు రోజూ ఒక స్పూను తరిగిన బెల్లాన్ని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
*
రక్తహీనతతో బాధపడేవాళ్లు బెల్లాన్ని తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. బెల్లంలో ఇనుము శాతం ఎక్కువ. ఇది ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

Leave A Reply

Your email address will not be published.