బెల్లంపల్లి లో వైభ‌వంగా శ్రీ సీతారాముల క‌ల్యాణం

బెల్లంపల్లి: శ్రీరామనవమి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండరామాలయంలో సీతారాముల కల్యాణం వైభ‌వంగా నిర్వ‌హించారు. బుధ‌వారం ఇక్క‌డ నిర్వ‌హించిన క‌ల్యాణ‌ వేడుక కోసం నిర్వ‌హ‌కులు భారీగా ఏర్పాట్లు చేశారు.
వేద పండితుల మంత్రోచ్ఛార‌ణల న‌డుమ అభిజిత్ ల‌గ్నంలో క‌ల్యాణ క్ర‌తువును ఘ‌నంగా నిర్వ‌హించారు. జిల‌క‌ర్ర‌, బెల్లం పెట్టారు. అనంత‌రం మాంగ‌ళ్య‌ధార‌ణ జ‌రిగింది. ఈ క‌మ‌నీయ వేడుక రామ భ‌క్తుల్ని ఆనంద పార‌వ‌శ్యంలో ముంచెత్తింది. రాముడి దోసిట నీలు రాసులు.. సీతాదేవి దోసిట కెంపులు త‌లంబ్రాలుగా మారాయి.
క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల భ‌క్త‌జ‌నుల సంద‌డి లేకుండానే క‌ల్యాణ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్వాహ‌కులు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ వేడుక‌లో బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, ఆయ‌న సతీమణి జయతార, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి-భీమాగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింగం, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, చంద్రవెల్లి మాజీ సర్పంచ్ వీణ-లక్ష్మణ్, కమిటీ సభ్యులు సరిత, పద్మ, TRS పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, నాయ‌కులు, ప్ర‌జ‌ల‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.